నకిలీ విత్తనాలు అమ్మేవారిపై .. ఏం చర్యలు తీసుకున్నరు : హైకోర్టు

నకిలీ విత్తనాలు అమ్మేవారిపై .. ఏం చర్యలు తీసుకున్నరు : హైకోర్టు
  • రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: నకిలీ విత్తన విక్రయదారుల నుంచి రైతులను ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నకిలీ విత్తనాలను అమ్మేవాళ్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రైతుల స్థితిగతులను పట్టించుకోని వాణిజ్య విత్తన కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలని తెలిపింది.

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌‌‌‌  జనరల్‌‌‌‌ (ఏఏజీ) చేసిన వినతి మేరకు కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. పలు విత్తన కంపెనీలు రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నాయని 2016లో ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్  రెడ్డి దాఖలు చేసిన పిల్​పై చీఫ్‌‌‌‌  జస్టిస్‌‌‌‌  అలోక్‌‌‌‌  అరాధే, జస్టిస్‌‌‌‌  అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌  జూకంటి డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌  మంగళవారం విచారించింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ  ఇమ్రాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌  వాదిస్తూ.. విచారణను 4 వారాలకు వాయిదా వేయాలని కోరగా అందుకు హైకోర్టు అనుమతించింది.