పోలీస్ నియామకాల్లో అన్యాయం జరుగుతోంది: హైకోర్టు న్యాయవాది

పోలీస్ నియామకాల్లో అన్యాయం జరుగుతోంది: హైకోర్టు న్యాయవాది

ఎసై, కానిస్టేబుల్ నియామకాల్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చర్యలను న్యాయస్థానం తప్పుబట్టినట్లు హైకోర్టు న్యాయవాది పివి. కృష్ణమాచారి అన్నారు. ప్రిలిమ్స్ పరీక్షలు పుర్టైన తరువాత బోర్డు జీవో 57, 58ను తీసుకొచ్చి ఎస్సి, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మేన్స్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తీవ్ర అన్యాయానికి గురి చేసిందని ఆయన తెలిపారు.

హైదరాబాద్ కాచిగూడలోని ఆయన కార్యాలయంలో ఎసై , కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి ఆయన మాట్లాడారు. జీవో 57 , 58 ను సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ ఫిటీషన్ పలువురు అభ్యర్థులు వేసినట్లు పేర్కొన్నారు. ఈ జీవో ద్వారా కటఫ్ మార్కుల కారణంగా అభ్యర్థులు ఉద్యోగాన్ని కోల్పోతున్నారని వివరించారు. ఈ రిట్ ఫిటీషన్ పై బోర్డు సమర్పించిన రిపోర్ట్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించలేదని అన్నారు. 

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్దామన్నారు. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా బోర్డు న్యాయస్థానంకు పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించినట్లు న్యాయవాది తెలిపారు. బోర్డు వైఖరి కారణంగా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని... ఈ జీవో లను న్యాయస్థానం తీర్పును వచ్చే వాయిదాలోగా వెల్లడిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.