ఇసుక అక్రమ మైనింగ్ కేసులో ..ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఇసుక అక్రమ మైనింగ్ కేసులో ..ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు : యాదాద్రి భువనగిరి, సూర్యాపేట అక్రమ మైనింగ్‌ కట్టడికి తీసుకున్న చర్యలను చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ సహాయ డైరెక్టర్లను ఆదేశించింది. అక్రమ ఇసుక మైనింగ్‌పై చర్యలు తీసుకోవడం

లేదంటూ వి. మల్లేష్‌ సహా మరో 8 మంది వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్వీ శ్రావణ్‌ కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. బిక్కిరేవు వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరపు లాయర్ తెలిపారు..