
- సహకార శాఖకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌కు 4 వారాల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి రాష్ట్ర సహకార శాఖకు ఉత్తర్వులు ఇచ్చారు.
సహకారశాఖలో ఏండ్ల తరబడి ఎన్నికలు నిర్వహించడం లేదంటూ బి. గోపరాజు, ఇతరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున శ్రీధర్ రెడ్డి వాదనలు వినిపించారు. దీనిని విచారించిన బెంచ్ ప్రస్తుత కమిటీ సభ్యుల జోక్యంలేకుండా తుది ఓటర్ల జాబితాను రెడీ చేయాలని సహకార సంఘ అధికారిని ఆదేశిచింది. కమిటీ నివేదికతో ప్రమేయం లేకుండా ఓటర్ల లిస్ట్ సిద్ధం చేయాలని పేర్కొంది.