ములుగు అభివృద్ధికి ఫండ్స్..ఎందుకిస్తలే?

ములుగు అభివృద్ధికి ఫండ్స్..ఎందుకిస్తలే?
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
  • పూర్తి వివరాలతో సమాధానం చెప్పాలని ఆర్డర్స్​
  • ఎమ్మెల్యే సీతక్క రిట్‌‌పై విచారణ

హైదరాబాద్, వెలుగు :  అన్ని నియోజకవర్గాల డెవ లప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం ఫండ్స్​ఇస్తూ.. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గానికి ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వచ్చే నెల మూడో తేదీ నాటికి పూర్తి వివరాలతో సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. నియోజకవర్గ అభివృద్ధి నిధుల మంజూరు అధికారాన్ని జిల్లాకు చెందిన మంత్రికి అప్పగిస్తూ ప్రభుత్వం 2021లో జారీ చేసిన జీవోలు 12, 14 ను ములుగు ఎమ్మెల్యే సీతక్క కోర్టులో సవాల్‌‌‌‌ చేశారు. ఆ రిట్​పిటిషన్‌‌‌‌ను శుక్రవారం జస్టిస్‌‌‌‌ చిల్లకూరు సుమలత విచారించారు. సీతక్క తరఫున సీనియర్‌‌‌‌ లాయర్లు శ్రీపాద ప్రభాకర్, కృష్ణకుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌ వాదిస్తూ..

ములుగు నియోజకవర్గ అభివృద్ధికి ఫండ్స్​ ఇవ్వకుండా ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. లోకల్‌‌‌‌ ఎమ్మెల్యేను సంప్రదించకుండా మంత్రి అభివృద్ధి పనులను మంజూరు చేయడం దారుణమన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే సెగ్మెంట్​కు నిధులు ఇవ్వకపోవడం అనైతిక చర్యగా వారు అభివర్ణించారు. ప్రభుత్వ  అడ్వొకేట్​ హరీందర్‌‌‌‌ పరిషద్‌‌‌‌ కల్పించుకుని కౌంటర్‌‌‌‌ వేసేందుకు 4 వారాల గడువు కావాలని కోరారు. దీనిపై శ్రీపాద అభ్యంతరం చెప్పారు. డిసెంబర్‌‌‌‌ నాటికి అసెంబ్లీ ఎన్నికలు రావచ్చునని,

అంత గడువిస్తే ప్రయో జనం ఉండదని, ములుగు ప్రజలకు అన్యాయం జరుగు తుందని చెప్పారు. 2 వారాల గడువు కావాలని కోరినా అందుకు హైకోర్టు అంగీకరించలేదు. విచారణను అక్టోబర్‌‌‌‌ 9కి వాయిదా వేసింది. ఈలోగా కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.