అధికారులు నిద్రపోతున్నరా? -హైకోర్టు సీరియస్

అధికారులు నిద్రపోతున్నరా? -హైకోర్టు సీరియస్

పదేండ్లుగా కౌంటర్  ఫైల్ చెయ్యరా? 

‘విద్యాహక్కు చట్టం’  పిల్‌‌పై హైకోర్టు విచారణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదని ఫైల్ అయిన పిల్ పై ప్రభుత్వం పదేండ్లుగా కౌంటర్ ఫైల్ చేయలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్నేండ్లుగా కౌంటర్ ఫైల్ చేయకుండా అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించింది. అసలు రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు అవుతోందా? లేదా? అనే సందేహం వ్యక్తం చేసింది. ఈ పిల్ పై చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం విచారణ చేపట్టింది. పదేండ్లుగా పిల్‌‌లో కదలిక లేదని, అధికారులు అంత బిజీగా ఉన్నారా? అని ప్రశ్నించింది. సోమవారం లోపు కౌంటర్‌‌ ఫైల్ చేస్తామని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంజీవ్‌‌కుమార్‌‌ హామీ ఇచ్చారు. కేంద్రం ఖర్చుల వాటాపై క్లారిటీ ఇవ్వలేదని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే చివరి అవకాశమని, బడ్జెట్‌‌ వివాదాన్ని ఈ నెల 17లోగా పరిష్కరించుకోవాలని చెప్పిన హైకోర్టు.. తుది విచారణ 18న చేపడతామంది.