Farm house case : సీజే అనుమతిస్తేనే పిటిషన్ను విచారిస్తాం : హైకోర్టు

Farm house case : సీజే అనుమతిస్తేనే పిటిషన్ను విచారిస్తాం : హైకోర్టు

ఫాం హౌస్ కేసును సీబీఐకు అప్పగించాలన్న తీర్పుపై స్టే కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సింగిల్ బెంచ్ వాయిదా వేసింది. గతంలో ఈ అంశంపై విచారణకు సీజే బెంచ్ నిరాకరించిన విషయాన్ని గుర్తు చేసిన ధర్మాసనం.. ప్రధాన న్యామూర్తి అనుమతిస్తేనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. బుధవారం సీజే పర్మిషన్ తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ చెప్పడంతో కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది. 

అంతకు ముందు  ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ కు సంబంధించి ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. ఫాం హౌస్ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా అని ప్రశ్నించగా.. ఇంకా చేయలేదని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. కేసు డైరీ కోసం సీబీఐ ఒత్తిడి చేస్తున్న విషయాన్ని  న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వారం రోజుల సమయం అవసరమని చెప్పారు. మరోవైపు ఫాం హౌస్ కేసును విచారణను సీబీఐకు బదిలీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ న్యాయమూర్తికి విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం సీజే అంగీకరిస్తే పిటిషన్ టేకప్ చేస్తామని ప్రకటించిన న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.