
హైదరాబాద్, వెలుగు: గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను బాటసింగారానికి తరలించడం ఆపాలని హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ నెల 4 వరకు యథాతథ స్థితి కొనసాగించాలని చెప్పింది. బాటసింగారంలో వసతులపై కౌంటర్ ఫైల్ చేయాలని రంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. మార్కెట్ తరలింపు పై ఫ్రూట్ మార్కెట్ హోల్‌సేల్ కమీషన్ ఏజెంట్లు, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను జడ్జిలు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల బెంచ్ శుక్రవారం విచారించింది. బాటసింగారంలో సౌలత్లు కల్పించకుండానే ప్రభుత్వం మార్కెట్ తరలింపు చేపట్టిందని పిటిషనర్ల తరఫు లాయర్ వాదించారు. ప్రభుత్వ తరఫు లాయర్ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.