తెలంగాణలో టీచర్ల బదిలీలపై హైకోర్ట్ స్టే విధించింది. మార్చి 14 వరకు బదిలీలపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఉద్యోగ దంపతులు, యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపింది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మార్చి 14 వరకు స్టే విధించింది.
