హకీంపేట స్పోర్ట్స్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ఓఎస్డీ సస్పెన్షన్‌‌‌‌ చెల్లదు: హైకోర్టు

హకీంపేట స్పోర్ట్స్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ఓఎస్డీ సస్పెన్షన్‌‌‌‌ చెల్లదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు:  లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇటీవల సస్సెండ్‌‌‌‌ అయిన హకీంపేట స్పోర్ట్స్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ఓఎస్డీ టి. హరికృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. సస్పెన్షన్‌‌‌‌ను సవాల్‌‌‌‌ చేస్తూ హరికృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై జస్టిస్‌‌‌‌ పుల్లా కార్తీక్‌‌‌‌ తీర్పు చెప్పారు. సస్పెన్షన్‌‌‌‌ తర్వాత ఆఫీసర్లు ఏర్పాటు చేసిన కమిటీ  కూడా లైంగిక వేధింపుల అభియోగాలు వాస్తవమని తేల్చలేదని, అందుకే సస్పెండ్‌‌‌‌ ఉత్తర్వులను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు.  

మంత్రి చెప్పారని హరికృష్ణను సస్పెన్షన్​ చేయడం నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ లాయర్‌‌‌‌ కోర్టుకు విన్నవించారు. వాదనలను విన్న కోర్టు హరికృష్ణపై ఉన్న సస్పెన్షన్‌‌‌‌ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.