ఇవాళ(ఏప్రిల్ 08) జస్టిస్ ఘోష్ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై హైకోర్టు తీర్పు

ఇవాళ(ఏప్రిల్ 08) జస్టిస్ ఘోష్ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఘోష్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ నివే దికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌లపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో జరిగిన అవకతవకలపై విచార ణ నిమిత్తం జస్టిస్‌‌‌‌‌‌‌‌ పీసీ ఘోష్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ను నియమిస్తూ 2024, మార్చి 14న జారీ చేసిన జీవో 6ను కొట్టివేయాలని, అలాగే కమిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు, ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌.కె. జోషిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌లపై చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ అపరేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జీఎం మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌తో కూడిన బెంచ్‌‌‌‌‌‌‌‌ ఇరుపక్షాల వాదనలను విని మార్చి 12న తీర్పును రిజర్వు చేసింది. దీనిపై బుధవారం తీర్పు వెలువరించనుంది.