భాగ్యనగరానికి హై అలర్ట్.. జులై 27 రాత్రి హైదరాబాద్​ ఆగమే..

భాగ్యనగరానికి హై అలర్ట్..  జులై 27 రాత్రి హైదరాబాద్​ ఆగమే..

బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో వారం  రోజులుగా హైదరాబాద్‌ నగరం తడిసి ముద్దవుతోంది. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ నిపుణులు చెప్పిన మరో వార్త నగర వాసులను భయపెట్టిస్తోంది. 

జులై 27 రాత్రి 5 – 6 సెం.మీ.ల వర్షపాతం నగరంలో నమోదు కానుందని వాతావరణ కేంద్రం డైరెక్టర్​ కె.నాగరత్న చెప్పారు. ఈ వార్త పబ్లిక్​ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్పా బయటకి రావొద్దని సూచిస్తున్నారు. 

వరదలు.. ట్రాఫిక్​ జామ్​లు..

నగరంలో కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలకు ఎల్బీనగర్, పటాన్​చెరు, మేడ్చల్ లాంటి సిటీ బయటి ప్రాంతాలే కాక.. సిటీలోని ప్రాంతాలు సైతం తడిసి ముద్దవుతున్నాయి. వర్షాలతో పాటు పబ్లిక్​ సమస్యలు కూడా తగ్గట్లేదు. ఆఫీస్​లకు వెళ్లేవారు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.