ఇకపై హైరిస్క్ ఫ్యాక్టరీలకు చెక్ లిస్ట్ ..భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిందే: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఇకపై హైరిస్క్ ఫ్యాక్టరీలకు చెక్ లిస్ట్ ..భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిందే: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు 
  • యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం 
  • ఫ్యాక్టరీల శాఖ, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రి వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: ఫ్యాక్టరీలలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఇకపై అన్ని జిల్లాల్లో కెమికల్, ఫార్మా, హై-రిస్క్ పరిశ్రమలన్నింటికీ చెక్ లిస్ట్ ను ప్రకటిస్తామన్నారు. నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఫ్యాక్టరీల శాఖ, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన భద్రతా వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రి వివేక్ మాట్లాడారు. పరిశ్రమలలో పైస్థాయి నుంచి కార్మికుల స్థాయి వరకూ అందరి భద్రతకూ చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని చెప్పారు. భద్రత కోసం తీసుకునే చర్యలకు ఖర్చేమీ ఎక్కువ కాదన్నారు. సిగాచి ఫ్యాక్టరీ ఘటనలో ఫ్యాక్టరీల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ ఇచ్చిన సాధారణ సూచనలను పాటించి ఉంటే, కంపెనీకి రూ. 20 నుంచి రూ. 25 లక్షలకు మించి ఖర్చు అయ్యేది కాదన్నారు. ఇప్పుడు ప్రమాదం జరగడం వల్ల రూ. 50 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 

డిఫెన్స్ రంగంలో పనిచేసిన కొందరు డైరెక్టర్లు ఉన్న కంపెనీలో కూడా సాధారణ నిబంధనలు అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కట్-ఆఫ్ కోసం థర్మోస్టాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేకపోవడం, ఒత్తిడి పెరిగినప్పుడు ఎలక్ట్రికల్ నియంత్రణలు లేకపోవడం, ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాకింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయకపోవడం వంటి సాధారణ లోపాలే ప్రమాదానికి దారి తీశాయన్నారు.
   
భద్రతపై చెక్ లిస్ట్​.. ప్రతి జిల్లాకు ఓ బృందం 

ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, బాయిలర్స్, కార్మిక విభాగాల నిపుణులతో ప్రతి జిల్లాలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు. ఈ బృందాలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రసాయన, ఫార్మా, హై-రిస్క్ పరిశ్రమలన్నింటినీ పిలిచి సమావేశాలు నిర్వహిస్తాయన్నారు. 

ముందు పరిశ్రమలకు ఒక చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్ ఇస్తారని, దానిని పరిశీలించి, ప్రాథమిక భద్రతా చర్యలు పాటిస్తున్నారా? లేదా? అని తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఎవరినీ వేధించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని.. కనీస భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అనేది మాత్రమే చూస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీల శాఖ ఉన్నతాధికారులు, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ప్రతినిధులు, భద్రతా నిపుణులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.