TSPSC: టీఎస్పీఎస్సీ దగ్గర ఉద్రిక్తత

TSPSC: టీఎస్పీఎస్సీ దగ్గర  ఉద్రిక్తత

టీఎస్ పీఎస్ సీ (TSPSC) దగ్గర ఉద్రిక్తత నెలకొంది.  గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ  ఇవాళ  చలో TSPSC ముట్టడికి పిలుపునిచ్చారు ఓయూ, ఎన్ఎస్ యూఐ నాయకులు. జిల్లాల నుంచి వేలాది మంది  విద్యార్థులు తరలివచ్చి టీఎస్ పీఎస్ సీ ముట్టడికి యత్నించారు. దీంతో  విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.   టీఎస్ పీఎస్ సీ ముందు ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు. గ్రూప్ 2 ఎగ్జామ్ కనీసం మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు , విద్యార్తులకు మధ్యా కాసేపు తోపులాట జరిగింది. విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ALSO READ: READ:మా జాబ్​లను రెగ్యులర్ చేయండి: మత్స్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా

ఆగస్టు 2 నుంచి 21 వరకు గురుకుల పరీక్షలు ఉన్నాయి. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు జేఎల్ పరీక్షలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ అధికారులు ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో చాలా పరీక్షలు ఉన్నాయంటున్నారు అభ్యర్థులు. గురుకుల, జూనియర్ లెక్చరర్ పరీక్షలతో ఇబ్బంది ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. ఎకానమి పేపర్ లో అదనంగా 70శాతం సిలబస్ ఉందన్నారు. గ్రూపు 2 పరీక్షలప్పుడే రాఖీ పండగ వచ్చిందని చెప్పారు. ఆగస్టు 31న రాఖీ సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు.. గ్రూపు 2 పరీక్షలు వాయిదా ఉండదని టీఎస్పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. ఇంకోవైపు.. గ్రూప్ 2  పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. .