ఎఫ్-15 జెట్ను కూల్చేశాం: ఇరాన్ ప్రకటనతో హార్మూజ్ జలసంధి వద్ద హైటెన్షన్

ఎఫ్-15 జెట్ను కూల్చేశాం: ఇరాన్ ప్రకటనతో హార్మూజ్ జలసంధి వద్ద హైటెన్షన్

టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌‌‌‌‌‌‌‌కు 48 గంటల అల్టిమేటం జారీ చేసిన కొద్ది గంటల్లోనే, హార్మూజ్ ద్వీపం సమీపంలోని దక్షిణ తీరంలో ఒక ‘శత్రు దేశ’ ఎఫ్​-15 యుద్ధ విమానాన్ని తమ గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. 

ఇరాన్ యొక్క 'ఫార్స్ న్యూస్' ఈ ఘటనను ధృవీకరిస్తూ, తమ క్షిపణి వ్యవస్థ ఎఫ్​-15 విమానాన్ని విజయవంతంగా లక్ష్యంగా చేసుకుని, ధ్వంసం చేసినట్లు చూపుతున్న ఒక వీడియోను కూడా సాక్ష్యంగా విడుదల చేసింది. అయితే, ఈ విమానం ఏ దేశానికి చెందినదనేది ఇరాన్ వెల్లడించలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అమెరికాతో పాటు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మరియు ఖతార్ దేశాలు కూడా ఎఫ్-15 విమానాలను ఉపయోగిస్తున్నాయి.

  • 4 వారాల్లో 6 ఫైటర్ జెట్​ల కూల్చివేత

గత నాలుగు వారాలుగా కొనసాగుతున్న ఈ ఘర్షణల్లో ఇరాన్ చేతిలో దెబ్బతిన్న లేదా కూలిన యుద్ధ విమానాల సంఖ్య ఈ ఘటనతో అర డజనుకు చేరుకుంది. ఇందులో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా చెబుతున్న ఎఫ్​–35, ఎఫ్ 16 ఫైటర్ జెట్ లు  కూడా ఉన్నాయి.

 ఎఫ్-35 విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని, పైలట్ సురక్షితంగా బయటపడ్డారని అమెరికా రక్షణ శాఖ అధికారులు కూడా ధృవీకరించడం గమనార్హం. యుద్ధ చరిత్రలో ఒక స్టీల్త్ యుద్ధ విమానం ఇలా దెబ్బతినడం ఇదే మొదటిసారిగా భావిస్తున్నారు. ఈ వరుస పరిణామాలు హార్మూజ్ జలసంధి ప్రాంతంలో పెను ముప్పును సూచిస్తున్నాయి.