ఢిల్లీలో హై టెన్షన్.. రెండోసారి ఈడీ ముందుకు కవిత

ఢిల్లీలో హై టెన్షన్.. రెండోసారి ఈడీ ముందుకు కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత నేడు రెండోసారి ఈడీ విచారణకు హాజరు కానున్న కారణంగా ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. కొద్దిసేపట్లో కవిత విచారణకు హాజరు కానున్న క్రమంలో కవితతో పాటు మంత్రి కేటీఆర్, హరీష్ రావు, మంత్రులు ఢిల్లీ చేరుకున్నారు. ఈడీ విచారణకు వెళ్లే ముందు కవిత ప్రెస్ మీట్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులంతా ఆందోళనలు, ధర్నాలు చేసే అవకాశం ఉందన్న ఢిల్లీ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీసు ముందు సెక్షణ్ 144  విధించి భద్రతా బలగాలను మోహరించారు. 

ఈడీ దర్యాప్తు  అంతా కవిత ఫోన్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం వాడుతున్న ఫోన్ ను, ఇదివరకు వాడిన ఫోన్ పై విచారణ చేపట్టే అవకాశం ఉంది. కన్ ఫ్రంటేషన్ విధానంలో కవిత విచారణ ఎదురుకోనుంది. కవితతో పాటు ఆడిటర్ బుచ్చిబాబు ను కూడా ఇవాళ ఈడీ విచారణ చేయనుంది. దీంతో విచారణకు వెళ్లే టైంలో ఆందోళన చేసేందుకు రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు.