కొత్త అసెంబ్లీ ఎందుకు కడుతున్నారు? : హైకోర్టు

కొత్త అసెంబ్లీ ఎందుకు కడుతున్నారు? : హైకోర్టు

హైదరాబాద్ : ఎర్ర మంజిల్ భవనం కూల్చివేతపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ ను విచారణ చేసిన హైకోర్టు… ప్రభుత్వం తరఫు న్యాయవాది నుంచి వివరాలు కోరింది. ఇప్పుడు ఉన్న అసెంబ్లీని కాదని.. కొత్త భవనం ఎందుకు కట్టాలనుకుంటున్నారని అని హైకోర్టు అడిగింది. ఇప్పుడున్న అసెంబ్లీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా అన్న హైకోర్టు…ఎర్ర మంజిల్ భవనం కూల్చివేతకు HMDA అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. HMDA అనుమతి ఉందా లేదా అన్న విషయం చెప్పడానికి ఇంత ఆలస్యం ఎందుకని అడిగింది హైకోర్టు. వాస్తవ పరిస్థితి ఏంటన్న దానిపై గురువారం నాడు వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇచ్చింది.