
- షెడ్యూల్ రిలీజ్ చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్
- కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి మూడు విడతల్లో అడ్మిషన్లు
- జూన్ 26న మొదలై ఆగస్టు 9న ముగియనున్న ప్రాసెస్
హైదరాబాద్, వెలుగు: బీఈ, బీటెక్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ను ఖరారు చేసింది. శనివారం కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఈఈ, జోసా, నీట్, దోస్త్ అడ్మిషన్లను పరిగణనలోకి తీసుకుని ఎంసెట్ అడ్మిషన్ షెడ్యూల్ ను తయారుచేశారు. మూడు విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి వెల్లడించారు. జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ.. ఆగస్టు 9తో ముగియనున్నదని చెప్పారు. ఆ తర్వాత స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెలరోజుల గడువులో అభ్యర్థులంతా ఇన్ కమ్, క్యాస్ట్, స్టడీ సర్టిఫికెట్లు రెడీ చేసుకోవాలని సూచించారు.
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి..
జూన్ 26 నుంచి జులై 5 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు స్లాట్ బుకింగ్
జూన్ 28 – జులై 6 వరకు స్లాట్ బుక్ చేసుకున్న స్టూడెంట్లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జూన్ 28 – జులై 8 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ
జులై 8న ఆప్షన్ల ఫ్రీజింగ్
జులై 12న సీట్ల అలాట్మెంట్
జులై 19 వరకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్
సెకండ్ ఫేజ్ జులై 21 నుంచి..
జులై 21, 22 తేదీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల కోసం స్లాట్ బుకింగ్
జులై 23న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జులై 21 – 24 వరకు వెబ్ ఆప్షన్లు
జులై 28 – సీట్ల అలాట్మెంట్
జులై 31 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్
ఫైనల్ ఫేజ్ ఆగస్టు 2 నుంచి 9 వరకు
ఆగస్టు 2న ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్
ఆగస్టు 3న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ఆగస్టు 2 – 4 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ
ఆగస్టు 7న సీట్ల అలాట్మెంట్
ఆగస్టు 9 లోపు కాలేజీల్లో రిపోర్టింగ్