బెంగళూరు, గోవాల్లో హిల్టన్ హోటళ్లు

బెంగళూరు, గోవాల్లో హిల్టన్ హోటళ్లు

హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ హాస్పిటాలిటీ సంస్థ హిల్టన్ , తన ప్రీమియం ఎకానమీ బ్రాండ్ 'స్పార్క్ బై హిల్టన్' ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీంతో  ఆసియా పసిఫిక్ మార్కెట్లోకి ప్రవేశించింది. కంపెనీ దేశవ్యాప్తంగా 150 హోటళ్లను ఏర్పాటు చేయాలని చూస్తుండగా, ఇందుకోసం  'ఆలివ్ హాస్పిటాలిటీ'తో ఇప్పటికే  వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. 

ఇందులో భాగంగా మొదటి రెండు హోటళ్లను బెంగళూరు (మారతహళ్లి), గోవా (కలంగూట్​) లలో బుధవారం ప్రారంభించింది. మధ్యతరగతి ప్రయాణికులు తమ టార్గెట్ అని తెలిపింది.