సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న టూరిస్ట్ బస్సు లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అత్యవసర బృందాలు ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డవారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై సిర్మౌర్ ఎస్పీ నిశ్చింత్ సింగ్ నేగి మీడియాతో మాట్లాడుతూ.. బస్సు కుప్వి నుంచి సిమ్లాకు వెళ్తుండగా హరిపుర్ధార్ ప్రాంతానికి సమీపంలో ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించినట్లు ఆయన వెల్లడించారు.
►ALSO READ | రష్యాలో రోడ్డు ఊడ్చేవాళ్లకు కూడా లక్ష రూపాయల జీతం.. పోదాం అన్నయ్య రష్యా పోదాం..
పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలో సహయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డ్రైవర్ రోడ్డును సరిగ్గా అంచనా వేయడంలో విఫలమై బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు.
