వామ్మో... ఇదెక్కడి ఆచారంరా నాయినా... ఏడాదికొక్కసారే స్నానం..

వామ్మో... ఇదెక్కడి ఆచారంరా నాయినా... ఏడాదికొక్కసారే స్నానం..

కొందరు రోజురోజు స్నానం చేస్తేనే వారి శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటిది వారు సంవత్సరానికోసారి స్నానం చేస్తారంటా.. అయినా కానీ వారి దగ్గరి నుంచి సుగంధ వాసనే కానీ.. దుర్వాసన రాదంట. ఇంతకీ వారు ఎక్కడ ఉంటారు.. ఏ తెగ ప్రజలు ఇయర్లీ వన్స్​ బాత్​ .. ఎందుకలా చేస్తారో . .. ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

.. నమీబియాలో హింబా తెగకు చెందిన వారు ఏడాదికి ఒకసారి.. అది కూడా వారి పెళ్లిరోజున మాత్రమే స్నానం చేస్తారు. అయితే.. వారి ఆచారం ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నట్లు  ఆ తెగకు చెందిన జనాలు చెబుతున్నారు. రోజూ స్నానం చేస్తాం.. ఒక వేసవి కాలం వచ్చిదంటే చాలు.. ఉక్కబోత చెమటతో రెండు మూడు సార్లు కూడా స్నానం చేయడం సర్వసాధారణం. కాని ప్రపంచంలో ఓ తెగ ప్రజలు ఏడాదికి ఒక్కసారే స్నానం చేస్తారట.  అయినా సరే వారు ఎంతో ఫ్రెష్​ గా ఉంటారట.  వారు పక్కన నడిస్తే చాలు సుగంధం వాసన వెదజల్లుతుందని పరిశోధకలు చెపుతున్నారు.  ఇంతకూ ప్రపంచంలో ఆ ప్రాంతం ఎక్కడ ఉంది.. ఎందుకలా చేస్తారు... ఏడాదికి ఒక్కసారే సారే  హింబా తెగ వారు స్నానం చేస్తారంట. కొన్ని వందల ఏళ్లుగా ఇదే ఆచారం పాటిస్తు వస్తున్నారు. కేవలం పెళ్లి రోజు మాత్రమే దీనికి మినహయింపు ఉంటుందని ఇప్పటికి చెప్పుకుంటారు. 

మనలో చాలా మంది రోజుకు రెండు సార్లు స్నానం చేస్తారు. ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఉదయం చేస్తారు. ఆ తర్వాత రాత్రికి ఆఫీస్ నుంచి వచ్చాక అలసట పోయేందుకు స్నానం చేస్తుంటారు. కొందరు వేడినీళ్లు ఉపయోగిస్తే, చల్లని నీళ్లతో మరికొందరు స్నానంచేస్తారు.  ఇక సమ్మర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎండాకాలంలో దాదాపు అందరు రెండు సార్లు స్నానం చేస్తుంటారు. ఏవైన కారణాలతో ఒక రోజు స్నానం మిస్ అయితే... పక్కొడి పని ఐపోయినట్లే.. ఒంట్లో నుంచి వచ్చే చెమట కంపుతో వాడు దూరంగా పారిపోవాల్సిందే..

కానీ కొన్ని చోట్ల ఆచారాలు, సంప్రదాలు భిన్నంగా ఉంటాయి. ఇవి చూస్తే మాత్రం నోటి వెంబడి మాట రాదు. అచ్చం ఇలాంటి స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నమీబియాలో హింబా తెగకు చెందిన ప్రజలు ఉన్నారు. ఇక్కడ కొన్ని ఏళ్లుగా వెరైటీ ఆచారంను పాటిస్తున్నారు.   ఆఫ్రికన్ దేశమైన నమీబియా(Namibia)లోని కునేన్ ప్రావిన్స్‌లో హింబా అనే ఒక తెగకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత పొడిబారిన భూములు కలిగిన ప్రాంతాలలో ఒకటి. హింబా తెగ ప్రజల సంప్రదాయాలు(Traditions) అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.. ఈ తెగ ప్రజలు ఏడాదికి ఒక్కరోజు స్నానం చేస్తారంట. అది కూడా తమ పెళ్లిరోజున మాత్రమే ఫ్రెష్ గా స్నానం చేస్తారంట. ప్రస్తుతం ఈ తెగలో దాదాపు యూభై వేల మంది వరకు గిరిజనులు ఉన్నారంట. ఇక్కడ స్నానానికి వెరైటీ పద్ధతి ఫాలో అవుతారంట..  

Also read : నైజీరియాలో స్కూల్ నుంచి..287 మంది పిల్లల కిడ్నాప్

 ఆ ప్రాంతంలోని నీటి కొరత కారణంగా పరిమిత స్నానం(bath) అనేది వారి ఆచారంలో భాగంగా మారిపోయింది. వారు స్నానం చేయకపోయినప్పటికీ వారి శరీరం దుర్వాసన రాకపోవడం విశేషం. ఇక్కడి మహిళలు ఒక ప్రత్యేకమైన పేస్ట్‌(Paste)ను శరీరానికి రాసుకుంటారు.ఇది వారి శరీర దుర్వానను పోగొట్టడమే కాకుండా పలు విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యేకమైన పూత సూర్యరశ్మి(sunshine) నుండి వారి శరీరాన్ని కాపాడుతుంది. అలాగే క్రిమి కీటకాలు, పురుగుల నుండి వారికి రక్షణ కల్పిస్తుంది. ఈ పేస్ట్ మహిళల ముఖాన్ని కాంతివంతం(light) చేస్తుంది.

ఇక్కడ నిప్పులలో అడవి నుంచి సేకరించిన పరిమళ ద్రవ్యాలను వేస్తారంట. దీంతో సువాసనతో కూడా పొగవస్తుంది. ఈ పొగ తమ శరీరానికి గుండా పోయేలా చేస్తారంట..దీంతో శరీరంనుంచి దుర్వాసన అస్సలు రాదంట. ఈ స్నానం చేశాక.. ఒంట్లో నుంచి ప్రత్యేకమైన స్మెల్ వస్తుదంట. ఈ వాసనకు, కీటకాలు, పురుగులు కూడా దగ్గరకు రావని పరిశోధకులు చెబుతున్నారు.