హిమాయత్ నగర్ లో వైభవంగా శ్రీవారి వసంతోత్సవాలు.. ఘనంగా రథోత్సవం.. ఆలయప్రాంగణంలో శోభాయాత్ర

హిమాయత్ నగర్ లో  వైభవంగా శ్రీవారి వసంతోత్సవాలు.. ఘనంగా రథోత్సవం.. ఆలయప్రాంగణంలో శోభాయాత్ర

హిమాయత్​నగర్​లోని టీటీడీ శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి, ఆలయ ప్రాంగణంలో శోభాయాత్రగా ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళల కోలాటాలు, యువకుల భజనలు, చిన్నారుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.