రాబోయే మూడు నెలల్లో మరిన్ని జాబ్స్ వస్తాయ్

రాబోయే మూడు నెలల్లో  మరిన్ని జాబ్స్ వస్తాయ్

మ్యాన్పవర్ గ్రూప్ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా కష్టాల నుంచి కార్పొరేట్ ఇండియా తేరుకుందని, ఏప్రిల్ క్వార్టర్లో కొత్త జాబ్స్ వస్తాయని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా సర్వే తెలిపింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, సర్వీస్ సెక్టార్లు రాబోయే మూడు నెలల్లో మరింత ముందుకు వెళ్తాయని ‘మ్యాన్పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వే’ వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి. ‘‘జాబ్ మార్కెట్ రికవరీ అయింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లోనూ కొత్త జాబ్స్ బాగానే వస్తాయి. బడ్జెట్లో ప్రభుత్వం చేసిన ప్రకటనలు కూడా జాబ్ మార్కెట్కు ఊపును ఇచ్చాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, బీఎస్ఎఫ్ఐలో ఎక్కువ జాబ్స్ ఉంటాయి. అయితే ఉపాధి పెంపుకోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ఎఫెక్ట్ మూడు, నాలుగో క్వార్టర్లలో కనిపిస్తుంది. ఇండస్ట్రీలకు ఈ రెండు క్వార్టర్లు చాలా ముఖ్యం. పెద్ద కంపెనీలే ఎక్కువగా ఉద్యోగాలు ఇస్తాయి. తరువాత మీడియం సైజు కంపెనీల నుంచి ఆఫర్లు ఉంటాయి. గత క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్ జాబ్ రిక్రూట్మెంట్ మూడుశాతం ఎక్కువ ఉండొచ్చు’’ అని మ్యాన్పవర్ గ్రూప్ ఎండీ సందీప్ గులాటీ చెప్పారు. తమ సర్వే కోసం 2,375 మంది ఎంప్లాయర్ల నుంచి వివరాలను తీసుకున్నామని వెల్లడించారు. అయితే రిటైల్ ట్రేడ్, హోల్సేల్ సెక్టార్లలో జాబ్స్ చాలా తక్కువ ఉంటాయని అన్నారు. డిజిటల్ స్కిల్స్ ఉన్న వారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని, ఇంటి నుంచి లేదా, దూరపు ప్రదేశం నుంచి పనిచేయగలవారికి కంపెనీలు ఇంపార్టెన్స్ ఇస్తాయని గులాటీ చెప్పారు.