60 ప్లాట్లు వేలం.. సర్కార్ కు రూ. 105 కోట్ల ఆదాయం

60 ప్లాట్లు వేలం.. సర్కార్ కు రూ. 105 కోట్ల ఆదాయం

మోకిల హెచ్ఎండిఏ వెంచర్ ప్లాట్ల వేలానికి నాల్గవ రోజు మంచి ఆదరణ లభించింది.  ఆగస్టు 28 ఉదయం 30 ప్లాట్లు, మధ్యాహ్నం 30ప్లాట్లు కలిపి మొత్తం 60 ప్లాట్లకు అప్ సెట్ వ్యాల్యూ రూ.46.50 కోట్లు కాగా..  ప్లాట్ల అమ్మకాల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.105.16 కోట్లు కావడం గమనార్హం.హెచ్ఎండిఏ మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో ఫేజ్-1 లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా.. ఫేజ్-2 లో 300 ప్లాట్లకు వేలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్.టి.సి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

 మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ, రెండవ రోజు రూ.131.72 కోట్ల రెవెన్యూ,  మూడవరోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఆగస్టు 29 తో మోకిలా ఫేస్-2వేలం ప్రక్రియ ముగియనుంది.   

మోకిల హెచ్ఎండిఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడి ప్లాట్ల కొనుగోలు కోసం మంది పోటీ పడుతున్నారు.