
హైదరాబాద్ లో రియల్ భూం ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలుసు. ఎకరా వంద కోట్లకు పైగా పలికి దేశంలో చరిత్ర సృష్టించింది. అయితే సర్కార్ భూములను వేలంలో అమ్మిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. హాట్ కేకుల్లా ఎకరాల కొద్దీ ల్యాండ్స్‌ను కోట్ల రూపాయలకు అమ్ముతున్నా.. ఆ పైసలను వసూలు చేసుకునేందుకు తిప్పలు పడుతుంది. పైసలు కట్టాలంటూ భూములు తీసుకున్నోళ్లను అడుగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం చెబితే రియల్ బూమ్ పెంచేలా రూ.వందల కోట్లు పెట్టి కొన్నామని.. ఇప్పుడు కాస్త టైం కావాలని వ్యాపారులు చెబుతున్నారు. ఇచ్చిన సమయంలోపు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ కట్టని 10 మంది బిడ్డర్లకు హెచ్ఎండీఏ నోటీసులు కూడా జారీ చేసింది. అయినా డబ్బులు కట్టేందుకు ముందుకు రావడం లేదు బిడ్డర్లు. దీంతో పరేషాన్ లోపడ్డ హెచ్ఎండీఏ భూముల వేలంను వెంటవెంటనే వేయకుండా సమయం తీసుకుంటోంది .
మోకిలా నుండి కోలుకోడానికి కోకాపేట, బుద్వేల్ వేలం డబ్బులు చెల్లించారని లేటెస్ట్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది హెచ్ఎండీఏ. అయితే గతంలో భూముల వేలం డబ్బులు చెల్లించినా అధికారులు ప్రకటించలేదు. కొన్ని సందర్భాల్లో వేలంలో భూములను కొనుగోలు చేసిన వారి జాబితానే కూడా విడుదల చేయలేదు. అయితే సారి కొత్తగా కోకాపేట, బుద్వేల్ వేలం డబ్బులు చెల్లించారని ప్రకటన రిలీజ్ చేయడం గమనార్హం.