ఆదాయం పెంచుకునేందుకు HMDA ప్లాన్

ఆదాయం పెంచుకునేందుకు HMDA ప్లాన్

హైదరాబాద్, వెలుగు: ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్​ఎండీఏ ఆయా పరిసర ప్రాంతాల్లో భూముల లే అవుట్, ఇతరత్ర అనుమతులు ఉన్నాయా? లేవా అన్న వాటిపై క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికార యంత్రాంగాన్ని ఫీల్డులోకి దించింది. ఇప్పటికే గుర్తించిన అక్రమ వెంచర్లను వృద్ధిచేసిన బిల్డర్లు, రియల్టర్లు హెచ్​ఎండీఏ అనుమతులు తీసుకున్నరా? లేక అక్రమంగా ప్లాట్ల క్రయవిక్రయాలు కొనసాగిస్తున్నారా? అన్న దాన్ని ఫీల్డు లెవల్​ఆఫీసర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ వెంచర్ల రియల్టర్లు, బిల్డర్లు, యాజమానులకు వాటికి సంబంధించి పర్మిషన్​తీసుకునేలా ఈనెల 10వ తేదీ దాకా గడువు ఇచ్చింది. సిటీ చుట్టూ ఉన్న హెచ్​ఎండీఏ పరిధిలోని అక్రమ వెంచర్లకు అనుమతుల దరఖాస్తులతో భారీగా ఆదాయం సమకూర్చుకునే ప్లాన్​ వేసింది.

టౌన్​ప్లానింగ్​తో

కార్పొరేషన్లు.. మున్సిపాలిటిల్లోని టౌన్ ​ప్లానింగ్​ విభాగాలను పరిశీలిస్తే హెచ్​ఎండీఏ టౌన్​ప్లానింగ్​ డిపార్ట్ ​మెంట్​తోనే ఆదాయం సమాకురే ఛాన్స్​ఎక్కువగా ఉన్నది. ప్రధానంగా నిర్మాణ, లేఅవుట్​అనుమతుల్లో అక్రమలు చోటు జరగకుండా ఉండేందుకు మూడేళ్ల కిందట డెవలప్​మెంట్​పర్మిషన్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్​(డీపీఎంఎస్​) విధానాన్ని హెచ్​ఎండీఏ అందుబాటులోకి తెచ్చింది.  టౌన్​ప్లానింగ్​విభాగంలో అమలవుతున్న ఈ సిస్టమ్​హెచ్​ఎండీఏ ఖజానాకు భారీ ఆదాయం తెచ్చిపెడుతోంది. హెచ్​హెండీఏ ఇటీవల నిర్వహించిన ఉప్పల్​భగాయత్ ప్లాట్ల ఈ- వేలంతో రూ.677 కోట్లతో కాసుల పంట పండితే, డీపీఎంఎస్ విధానంతో రూ.170 కోట్ల రాబాడి వచ్చింది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న హెచ్​ఎండీఏ మరింత ఆదాయం పెంచుకునేలా ప్లాన్​చేస్తోంది. గ్రేటర్​లో ఎక్కడా స్థలాలు దొరకక్కపోవడంతో డెవలపర్లు, బిల్డర్లు, రియలర్టర్లు శివారులోనే ఎక్కువగా భూములు కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా శివారు ప్రాంతాలకే భారీ ప్రాజెక్టులు వస్తుండడంతో  పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటయ్యాయి. ఇందులో బిల్డింగ్​పరిష్మషన్స్​, లేఅవుట్​గేటెడ్​కమ్యూనిటీ, లేఅవుట్​విత్​హౌసింగ్​, నో ఆబ్జెక్షన్​ సర్టిఫికెట్​(ఎన్​ఓసీ), పెట్రోల్​ పంప్​ఆక్యూఫెన్సీ సర్టిఫికెట్​, ఫైనల్​ లేఅవుట్,  ఓపెన్​ ప్లాట్​ వంటి అనుమతులను హెచ్​ఎండీఏ ఆన్​లైన్​లోనే జారీ చేస్తోంది. వెంచర్లను డెవలప్​ చేసిన కొంతమంది లేఅవుట్​కోసం అనుమతులు తీసుకుంటుంటే, ఇంకొంతమంది నిబంధనలను పాటించుకుండా ఆదాయనికి గండికొడుతున్న అంశాన్ని హెచ్​ఎండీఏ గుర్తించింది. దాంతో తాము చేపడుతున్న స్పెషల్​ డ్రైవ్​తో డెవలపర్లు, రియల్టర్లు, బిల్డర్లు, లేఅవుట్​అనుమతులకు ముందుకు వస్తే హెచ్​ఎండీఏకు ఆదాయం పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

అనుమతులు లేకుంటే నోటీసులు

ఆదిబట్ల, వెలుగు: అనుమతులు లేని లే అవుట్లను గుర్తించి నోటీసులు జారీచేయనున్నట్లు ఆదిబట్ల మున్సిపల్​కమిషనర్​రాజేంద్రకుమార్​ చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా డెవలప్​చేసిన పలు లేఅవుట్లను హెచ్​ఎండీఏ సహాయ ప్లానింగ్​ అధికారి జ్ఞానేశ్వరాచారితో కలిసి గురువారం గుర్తించారు. ఏడు రోజుల్లో షోకాజ్ నోటీసుకు సమాధానం రాకుంటే వాటిని కూల్చివేస్తామని చెప్పారు.