అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన HMDA అధికారులు

అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన HMDA అధికారులు

అక్రమ నిర్మాణాలపై HMDA కొరఢా ఝుళిపిస్తోంది. నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా నిర్మించిన బిల్డింగులను కూల్చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 12వ తేదీ బుధవారం రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ లో అక్రమ నిర్మాణాలను HMDA నేలమట్టం చేసింది. నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భారీ భవనాన్ని ఇరిగేషన్, మణికొండ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా విల్లాల నిర్మాణం చేపట్టారని సదరు బిల్డర్లకు పలుమార్లు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో రెండు సార్లు విల్లాలను కూల్చేసినట్లు పేర్కొన్నారు. అయినా బిల్డర్ తీరు మారకపోవడంతో అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ మరోసారి అక్రమంగా నిర్మిస్తున్న విల్లాలను కూల్చివేశారు అధికారాలు.