నానక్ రామ్గూడ–గచ్చిబౌలి రోడ్డు విస్తరణ

నానక్ రామ్గూడ–గచ్చిబౌలి రోడ్డు విస్తరణ
  •     1.75 కి.మీ. పొడవున పనులు
  •     అదనపు లైన్​ ఏర్పాటు  
  •     అండర్‌‌పాస్‌‌లు, కల్వర్టుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధికి నిర్ణయం 

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: ఐటీ కారిడార్​లో నానక్​రామ్​గూడ నుంచి గచ్చిబౌలి మధ్య రోడ్లు చాలా ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్​సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి చెక్​ పెట్టడానికి హెచ్ఎండీఏలోని హైదరాబాద్​గ్రోత్​కారిడార్​అధికారులు ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఔటర్​కు ఎడమ వైపు నుంచి నానక్​రామ్ గూడ మీదుగా గచ్చిబౌలి వరకు ట్రాఫిక్​సమస్య ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే మూసీ మీదుగా నార్సింగి, ఔటర్ కు రెండువైపులా కవర్​చేస్తూ ఫ్లై ఓవర్​కట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా నానక్​రామ్​గూడ నుంచి గచ్చిబౌలి రోడ్డును విస్తరించనున్నారు. 

రూ.26.50 కోట్లతో పనులు

నానక్‌‌రామ్‌‌ గూడ నుంచి గచ్చిబౌలి వరకు 1.75 కి.మీ. పొడవున ఓఆర్‌‌ఆర్ ఎడమ ప్రధాన రహదారి విస్తరణ పనులను రూ.26.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగాఅదనపు లేన్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతమున్న అండర్‌‌పాస్‌‌లు, కల్వర్టుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి చేస్తారు. ప్రాజెక్టుకు సంబంధించి పరిపాలనా అనుమతులు లభించాయి. పనులు త్వరలో ప్రారంభించనున్నారు.