చిన్న వెంచర్లపై  హెచ్ఎండీఏ చిన్నచూపు

చిన్న వెంచర్లపై  హెచ్ఎండీఏ చిన్నచూపు
  • ఇప్పటికీ ఆ ఐడియాను కార్యాచరణలోకి తేని ఆఫీసర్లు 
  • అందుబాటులోకి వస్తే తక్కువ ధరకే ప్లాట్లు
  • ఐదేళ్ల కింద డెవలప్​ చేసి విక్రయించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


హైదరాబాద్, వెలుగు: చిన్న వెంచర్లను హెచ్ఎండీఏ చిన్నచూపు చూస్తోంది. కొద్దికొద్దిగా భూమిని సేకరించి, అభివృద్ధి చేసి ప్లాట్లుగా విక్రయించాలని ఐదేళ్ల కింద ఆఫీసర్లు ప్రతిపాదించారు. ప్రభుత్వం అందుకు గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల శివారు ప్రాంతాల్లో చిన్న వెంచర్ల అభివృద్ధికి ఆలోచనా చేసినా హెచ్ఎండీఏ ఆచరణలోకి మాత్రం తీసుకురాలేకపోతోంది. తక్కువ విస్తీర్ణంలో ప్లాట్ల అభివృద్ధికి భూ సేకరణ ఈజీ అవుతుందని ప్లాన్ చేసినా అమలుపై అధికారులు దృష్టి పెట్టడం లేదు.  
ఎక్కువ భూ సేకరణ ద్వారా.. 
ఒకేసారి వందల ఎకరాల భూసేకరణకు ఎన్నో ఇబ్బందులు, లీగల్ సమస్యలు వస్తున్నాయి. ఎక్కువ మంది రైతులు అమ్మితేనే అది పూర్తవుతుంది. దీంతో తక్కువ విస్తీర్ణంలో ఉండే పట్టా భూములను ఒకరిద్దరు ఇచ్చినా డెవలప్ చేయొచ్చని హెచ్ఎండీఏ అప్పట్లో భావించింది. 50 ఎకరాల్లోపు వెంచర్ల అభివృద్ధికి ప్లాన్ చేసింది. రైతులు తమకున్న భూముల్లో కొంత మొత్తాన్ని ఇచ్చినా.. మిగిలిన భూమికి డిమాండ్ వస్తుందని భావించింది. ఇందుకు చిన్న రైతులు సానుకూలంగా స్పందిస్తున్నారని అనుకుంది. ప్రతిపాదన నచ్చి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కారంలో చిన్న రైతులు150 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మేడ్చల్ జిల్లాలోని భోగారం,  రంగారెడ్డి జిల్లాలోని లేమూరులోను 60 ఎకరాలకు పైగా భూములు ఇచ్చేందుకు ఓనర్లు ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో చిన్న వెంచర్లకు భూ సమీకరణ ఈజీగా అయిపోతుందని అధికారులు భావించినా,  ఇప్పటికీ అమలు చేయలేదు. 
జంబో పూలింగ్ అట్టర్ ఫ్లాప్​
రంగారెడ్డి జిల్లాలోని మోకీలా, మేడ్చల్ జిల్లాలోని ప్రతాప సింగారం, కొర్రెముల ప్రాంతాల్లో దాదాపు1,800 ఎకరాల్లో భూములు సేకరించి భారీ లే అవుట్ నిర్మించేందుకు హెచ్ఎండీఏ ప్రయత్నించింది. కానీ ఆయా ప్రాంతాల్లోని భూముల ధరలు అధికంగా ఉండడంతో పాటు అమ్మేందుకు రైతులు ముందుకు రాలేదు. భూములు ఇచ్చేది లేదని గ్రామ సభల్లో రైతులు తేల్చి చెప్పడంతో ఇదేది సాధ్యం కాదని హెచ్ఎండీఏ వెనక్కి తగ్గింది. జంబో పూలింగ్ ఫెయిలవడంతో, ఆ తర్వాత తక్కువ విస్తీర్ణంలో ఉండే భూములను డెవలప్ చేయడమే ఉత్తమమని భావించినా, ఇప్పటికీ అధికారులు అమలు చేయడం లేదు.