ఈ నెల 7 నుంచి ఉప్పల్ భగాయత్ ఈ వేలం

 ఈ నెల 7 నుంచి ఉప్పల్ భగాయత్ ఈ వేలం
  • గడువు రెండు రోజులు మాత్రమే
  • రూ.600కోట్ల ఆదాయంపై హెచ్ ఎండీఏ ఆశలు

ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఈ-వేలానికి ఇంకా రెండే రోజుల గడువు మిగిలి ఉంది. ఈనెల 7, 8 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి హెచ్ఎండీఏ ఈ వేలం నిర్వహించనుంది. ఈ వేలం ద్వారా ఉప్పల్ భగాయత్  ఫేజ్‌-2 లేఅవుట్ లోని 67 ప్లా ట్ల విక్రయానికి కొనసాగిం చనుంది. దీనికి గాను రూ. 600కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని  హెచ్ఎండీఏ ఆశిస్తోంది. గతంలో ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన హెచ్ ఎండీఏ ఈ –వేలం ప్రక్రియ ప్రారంభానికి ముందు సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తడంతో దానిని నిలిపివేయాల్సి వచ్చింది. తాజాగా.. ఉప్పల్ భగాయత్  ప్లా ట్ల విక్రయం ద్వారా ఆదాయంవస్తుందా? అన్న ఆశలు అధికారుల్లో రెకెత్తుతున్నాయి.

పకడ్బందీ నిర్వహణకు సిద్ధం

గతంలో మాదిరికాకుండా ఈ -వేలం ప్రక్రి-యను ప్రైవేటు సంస్థతో కాకుండా కేంద్రప్రభుత్వం సంస్థతో ఒప్పం దం కుదుర్చు -కుంది. పకడ్బందీ గా నిర్వహించేం దుకుఅధికారులు రంగం సిద్ధం చేశారు. గతంలోఅనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారిఅలాజరకుండా ఈ వేలాన్ని కొనసాగించా-లని చర్యలు తీసుకుంటోంది.

67 ప్లాట్ల విక్రయం

భూ సమీకరణలో భాగంగా ఉప్పల్‌ మండలంలోని ఉప్పల్‌ లో హెచ్‌ఎండీఏ సేకరించిన 733.08 ఎకరాలలో వాటర్ బోర్డుకు,మెట్రో రైలుకు భూములు కేటాయించి మిగతా 413.13 ఎకరాలలో 1373 ప్లాట్లతో హెచ్‌ఎండీఏ ఫేజ్‌-1 లేఅవుట్ ను చేసింది. మెట్రో రైలు డిపోకు, మూసీనది  వెంట నిర్మిస్తున్న మినీ శిల్పారామం మధ్యలోని 71.08 ఎకరాల్లో ఫేజ్‌-2 లేఅవుట్ ను 67 ప్లాట్లను చేసిన హెచ్‌ఎండీఏ ఈ-వేలం ద్వారా విక్రయానికి  సన్నద్ధమై నోటిఫికేషన్ ఇచ్చింది.పూర్తిగా మల్టీ పర్పస్ జోన్ లోనే లేఅవుట్ ఫ్లాట్లు ఈ వేలం ద్వారా విక్రయించున్నా రు.

రియల్టర్లు, బిల్డర్లపైనే ఆశలు

ఉప్పల్‌ భగాయత్‌ లే-అవుట్‌ ఫేజ్‌-2 ప్లాట్ల ఈ-వేలం సందర్భంగా రియల్టర్లు , డాక్టర్లు, ఇతర ప్రొఫెషనల్స్ తో హెచ్ఎండీఏ అధికారులు ఇటీవల సమావేశమయ్యారు. మెట్రో రైలుతో పాటు రోడ్‌ కనెక్టివిటీ, ఇతరమౌలిక సదుపాయలతో నగరానికి మధ్యలోఉప్పల్‌ భగాయత్‌ లే-అవుట్‌ ప్లాట్ల కొనుగోలుకు ముందుకు  రావాలని  వారిని కోరారు.వ్యాపార  సముదాయాలు, ఐటీ పార్కు లు, మాల్‌ లాంటి భారీ భవన నిర్మాణాలకు అనుగుణంగా విశాల ప్రదేశంపై వారికి వివరించారు. అనంతరం పలువురు బిల్డర్లు , ఇతరులు ఉప్పల్‌ భగాయత్‌ లే-అవుట్‌ పేజ్‌-2ను వారికి చూపించారు. రియల్టర్లు , డాక్టర్లు, ఇతర ప్రొఫెషనల్స్‌  ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపితే ఆదాయం పెరిగే వీలుందని హెచ్ ఎండీఏ అధికారులు ఆలోచిస్తున్నారు