హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాతే గుర్తింపు సంఘానికి ఎన్నికలు జరిపించాలని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, మౌలనా, యాదయ్య, సురేశ్, యాదగిరి లేఖలు రాశారు. ఇచ్చిన హామీ మేరకు ముందుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆ తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలపై దృష్టి పెట్టాలని లేఖలో ఆర్టీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.
