రైట్స్ఇష్యూకు సుమీత్ ఇండస్ట్రీస్

 రైట్స్ఇష్యూకు సుమీత్ ఇండస్ట్రీస్

హైదరాబాద్​, వెలుగు:  పాలిస్టర్ తయారీ సంస్థ సుమీత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్థిక వృద్ధికి, వ్యాపార విస్తరణ కోసం రూ. 199.75 కోట్ల రైట్స్ ఇష్యూను ప్రకటించింది.  అర్హులైన వాటాదారులకు రూ. రెండు ముఖ విలువ కలిగిన 16.84 కోట్ల ఈక్విటీ షేర్లను రూ. 11.86 ధరతో విక్రయిస్తారు.

 ప్రతి 25 షేర్లకు ఎనిమిది రైట్స్ షేర్లను పొందవచ్చు. ఈ ఇష్యూ ద్వారా వచ్చే నిధులలో రూ. 49 కోట్లను సూరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నకోడా నుంచి కొనుగోలు చేసిన 1.40 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం గల పాలిస్టర్ చిప్స్ ప్లాంట్ పునరుద్ధరణకు ఉపయోగిస్తారు.

 మిగిలిన నిధులలో రూ. 100 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కోసం, రూ. 23 కోట్లు అప్పుల చెల్లింపు కోసం, రూ. 22 కోట్లు 6.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ స్థాపన కోసం కేటాయిస్తారు.