హైదరాబాద్, వెలుగు: అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ అరబిందో ఫార్మా యూఎస్ఏ.. అమెరికాకు చెందిన లారెట్ కంపెనీని 250 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2,100 కోట్లు) కొనుగోలు చేయడానికి యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆమోదం పొందింది. ఈ నగదు రహిత, అప్పులు లేని ఒప్పందం ఈనెల చివరికి పూర్తికానుంది.
పెన్సిల్వేనియాకు చెందిన లారెట్ కంపెనీ క్లిష్టమైన నాన్ ఓపియాయిడ్ నియంత్రిత మందులను తయారు చేస్తోంది. ఈ డీల్ వల్ల అమెరికాలో అరబిందో ఉత్పత్తులు విస్తరించడంతో పాటు ఇండియానాలో సొంత ప్రొడక్షన్ యూనిట్ అందుబాటులోకి వస్తుంది.
