బిల్డ్ కాన్తో మన కంపెనీలకు మేలు: మంత్రి మన్సుఖ్మాండవియా

బిల్డ్ కాన్తో మన కంపెనీలకు మేలు: మంత్రి మన్సుఖ్మాండవియా

హైదరాబాద్​, వెలుగు: నిర్మాణరంగ పరిశ్రమ కోసం ఢిల్లీలో జరుగుతున్న భారత్ బిల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాన్ 2026  దేశీయ, ప్రపంచ మార్కెట్లలో భారతీయ తయారీదారులకు ఉన్న అపారమైన వ్యాపార అవకాశాలను చూపిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు.

ఈ ప్రదర్శనను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి రెండు రోజుల్లోనే గతంలో జరిగిన అనేక పారిశ్రామిక ప్రదర్శనల కంటే రెట్టింపు సంఖ్యలో సందర్శకులను ఆకర్షించిందని ప్రశంసించారు.

ఈ ఈవెంట్ 90 కంటే ఎక్కువ దేశాల, 100 కంటే ఎక్కువ భారతీయ నగరాల బిల్డర్లు, ఆర్కిటెక్టులు, డెవలపర్లు, పరిశ్రమ నిపుణులను ఒకే చోటకు చేర్చి అతిపెద్ద వ్యాపార వేదికగా నిలిచింది. సిరామిక్స్, హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్, సిమెంట్, స్టీల్ వంటి 24 విభాగాల ప్రొడక్టులను చూపించారు.