సెప్టెంబర్ 28వ తేదీన సెలవు ప్రకటించిన ప్రభుత్వం

సెప్టెంబర్ 28వ తేదీన సెలవు ప్రకటించిన ప్రభుత్వం

మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ రోజైన సెప్టెంబర్ 28ని సెలవు రోజు(సాధారణ)గా ప్రకటించింది.  నెలవంక ఆధారంగా ముస్లిం మత పెద్దలు పండగ రోజును నిర్ణయిస్తారు. 

ప్రస్తుతానికి 28న సెలవు దినంగా ప్రకటించినా.. నెలవంక ఆధారంగా హాలీడే మారే అవకాశం ఉందని మత పెద్దలు చెబుతున్నారు. 

అల్లాహ్ శాంతి కోరుతూ..

ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, అల్లాహ్ ప్రపంచ శాంతి కోరుతూ చివరి ప్రవక్తగా మహమ్మద్ ఎంపికయ్యాడు. ముస్లింలందరూ అత్యంత పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్ గ్రంథంలో వీటి గురించి పేర్కొన్నారు.  

ప్రవక్త మహమ్మద్ ను విశ్వ శాంతి కోసం అల్లాహ్ నియమించారని, అందుకే తాను జన్మించిన రోజున.. ఆయనను స్మరించుకుంటూ ఈద్- ఎ మిలాద్ -ఉన్ -నబీ పండుగను జరుపుకుంటారు.