Home Food : ఇంటి భోజనం ఆరోగ్యమే కాదు.. శ్రద్ధ పెడితే అది ఒక కళ కూడా..

Home Food : ఇంటి భోజనం ఆరోగ్యమే కాదు.. శ్రద్ధ పెడితే అది ఒక కళ కూడా..

అనవసరంగా హోటళ్లలో..  రెస్టారెంట్లలో దొరికే ఫుడ్ మీద మోజు పెంచుకుంటారు కానీ, ఇంటి వంటే సో బెటర్ అంటున్నారు ఆహార నిపుణులు. ఇంట్లో వండుకొని తినడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం. . .

  •  ఇంటి భోజనం ఎంతో చౌక. బయట ఇద్దరు తినే ఖర్చుతో ఇంట్లో అందరికీ భోజనం వండేయొచ్చు.
  • అంతేకాదు.. ఇంట్లో వండుకుంటే శుభ్రత, రుచి అన్నీ ఉంటాయి. పైగా ఇంట్లో వండుకున్నది తింటే ఆరోగ్యకరం కూడా.
  • ఒత్తిడిని తగ్గించే పనుల్లో వంట కూడా ఒకటి. మనసు బాగాలేనప్పుడు సరదాగా ఏదైనా వంటకం ట్రై చేసి చూడండి. ఒత్తిడి మటాష్ అవుతుంది.
  • ఇంట్లో వండుకోవడం అంటే.. మనకు నచ్చినట్టుగా వండుకోవడమే. ఉప్పు... కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అనవసరంగా హోటల్ తిండి తిని.. ఏందో.. కూరలన్ని సప్పగ ఉన్నయ్ అని
  • బాధపడాల్సిన అవసరం రాదు.
  • మనకున్న టైమ్ ని బట్టి ఏం వండుకోవా లోడిసైడ్ కావొచ్చు. పైగా... చేయగా... చేయగా వంటల్లో ఆరితేరొచ్చు కూడా.
  • పాత్రలు, కూరగాయలు అన్నీ శుభ్రంగా కడుక్కొని వండుకుంటాం. కాబట్టి ఫుడ్ పాయిజన్ మన జోలికే రాదు.
  • లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. వంట చేయడం అనేది ఒక కళ.
–వెలుగు,లైఫ్​–