కరోనాతో హోంగార్డు మృతి

V6 Velugu Posted on Aug 06, 2021

హైదరాబాద్ లో పోలీస్ శాఖలో కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నా పలువురు పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. SR నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సుధాకర్ రెడ్డి(43) కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుధాకర్ కు కరోనా వ్యాక్సిన్ డోస్ పూర్తి అయినా కరోనాతో చనిపోయారు.

రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాటు జ్వరం, దగ్గు కూడా వస్తుండటంతో సుధాకర్ రెడ్డిని తోటి పోలీసు సిబ్బంది  చికిత్సకోసం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతు శుక్రవారం ఉదయం  మరణించాడు. సుధాకర్ రెడ్డి డెడ్ బాడీని  SR నగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించిన పోలీసులు.. సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు లక్షన్నర రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

Tagged home guard, corona, dies, Sudhakar Reddy

Latest Videos

Subscribe Now

More News