న్యూఢిల్లీ: బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు పదవుల కంటే దేశం, యువత, విద్యార్థులే ముఖ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. దేశ యువత మనోభావాలను మోదీ ప్రభుత్వం గౌరవిస్తుందని, పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని తెలిపారు.
దోషులకు కఠిన శిక్షలు ఖరారు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని, ఇది నీట్‌లో సఫలమైన విద్యార్థులకు పూర్తి న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ పదవీకాలాన్ని అమిత్ షా కొనియాడారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలు, మాతృభాషలోనే పరీక్షల నిర్వహణ, పీఎం శ్రీ పాఠశాలల విస్తరణ, డిజిటల్ విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో ప్రధాన్ కీ
లక సంస్కరణలు తెచ్చారని ప్రశంసించారు.
