
కశ్మీర్: పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ఘన నివాళి అర్పించారు. ఓ జవాను శవ పేటికను సైనికులతో పాటు ఆయన భుజానికెత్తుకున్నారు. సైనికుల పార్థివ దేహాలను తరలించేందుకు సిద్ధంగా ఉంచిన లారీ వరకు ఆ శవ పేటికను మోశారు.
ఢిల్లీలో శుక్రవారం ఉదయం జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో పాల్గొన్న అనంతరం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీనగర్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల పార్థివ దేహాలను ఉంచిన బుద్గాం సీఆర్పీఎఫ్ కాంపు వద్దకు చేరుకున్నారు.
ఆయనతో పాటు జమ్ము, కశ్మీర్ గవర్నర్ సత్య పాల్ మాలిక్, ఆర్మీ నార్తన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ రణ్ బీర్ సింగ్ కలిసి అమర జవాన్లకు నివాళి అర్పించారు. సైనికుల భౌతికాయాలను ఉంచిన శవపేటికలపై పుష్పగుచ్ఛాలను ఉంచి సెల్యూట్ చేశారు. ఆ తర్వాత ఓ అమర జవాను పార్థివ దేహాన్ని సైనికులతో పాటు కలిసి హోం మంత్రి రాజ్ నాథ్ భుజం కలిపి మృతదేహాలను తరలించే వాహనం వరకు చేర్చారు.
https://twitter.com/ANI/status/1096346936997761024