అర్హులైన జర్నలిస్టులకే ఇంటి స్థలాలు ఇవ్వాలి

అర్హులైన జర్నలిస్టులకే ఇంటి స్థలాలు ఇవ్వాలి
  • అదనపు కలెక్టర్‌కు వినతి పత్రాన్ని ఇచ్చిన మల్కాజిగిరి జర్నలిస్టులు

మల్కాజిగిరి, వెలుగు: అర్హులైన జర్నలిస్టులకే ఇంటి స్థలాలు ఇవ్వాలని మల్కాజిగిరి జర్నలిస్టులు జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహరెడ్డికి వినతి పత్రాన్ని ఇచ్చారు. మల్కాజిగిరి ప్రింట్ మీడియా హౌసింగ్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరున పెట్టిన విధానంపై ఇంటి స్థలాల కేటాయింపులు నిలిపివేసి, అర్హులైన జర్నలిస్టులకు మాత్రమే కేటాయించాలని వారు కోరారు. తమ వ్యక్తిగత స్వలాభం కోసం మల్కాజిగిరి ప్రింట్ మీడియా హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి విధానం పూర్తి అవాస్తమని, దానిని వెంటనే నిలిపి వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరిపించాలని అడిషనల్ కలెక్టర్‌ను కోరారు. కొన్నేండ్లుగా మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో వివిధ ఛానల్స్‌లో, దిన పత్రికలలో పనిచేస్తూ.. కిరాయి ఇండ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని అన్నారు. దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే, కలెక్టర్, ఛీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు అందించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మల్కాజిగిరి సర్కిల్ ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా సభ్యులు ఉన్నారు.