V6 News

నిజాయితీ అంటే ఇదే...ఆటోలో మర్చిపోయిన బంగారం.. గంటలో రికవరీ

నిజాయితీ అంటే ఇదే...ఆటోలో మర్చిపోయిన బంగారం.. గంటలో రికవరీ

సైఫాబాద్, వెలుగు:  ఆటోలో మర్చిపోయిన 6.5 తులాల బంగారు ఆభరణాలు, నగదును సైఫాబాద్ పోలీసులు గంట వ్యవధిలోనే బాధితురాలికి అందజేశారు. కర్నాటకకు చెందిన సుజాత అనే మహిళ శుక్రవారం నార్సింగి నుంచి బిర్లా మందిర్ వరకు ఆటోలో ప్రయాణించి, పొరపాటున తన బ్యాగ్​ను అందులోనే వదిలేసింది. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించి డ్రైవర్ నగేశ్​ను సంప్రదించారు. డ్రైవర్ తన వద్ద ఉన్న బ్యాగ్​ను నిజాయితీగా పోలీస్ స్టేషన్​లో అప్పగించగా, సీఐ సీతయ్య దానిని బాధితురాలికి అందజేశారు.