
టాలీవుడ్లో వీరసింహీరెడ్డి(Veerasimha reddy) సినిమా తర్వాత హనీరోజ్(Honey Rose) పేరు ట్రెండింగ్‌గా మారింది. ఓవర్‌నైట్‌లో ఈ నటి కుర్రకారు కలల రాణిగా మారిపోయింది. కానీ, ఆమె ఫేం కి తగ్గ ఆఫర్లు మాత్రం రావడంలేదు. ఇప్పటివరకు తెలుగులో ఆమె సైన్ చేసిన సినిమాలు పట్టాలెక్కలేదు. అయినా ఈ భారీ అందాల సుందరి నిరాశపడటం లేదు.
లేటెస్ట్ గా మూవీ కార్యక్రమాల్లో బ్యూటీ మాట్లాడుతూ..రాహేలు అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల్ని త్వరలో పలకరించబోతున్న. ఈ సినిమా నా జీవితంలో ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది. మీరు అందించే ప్రేమ..మద్దతు..అభిమానం నన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తాయని ఆశిస్తున్నా..మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తాను' అని పేర్కొంది. .
ఇక రీసెంట్గా ఈ మూవీ నుంచి రిలీజైన హనీ రోజ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. బోల్డ్ లుక్లో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది హనీ. ఈ మూవీలో బీఫ్ అమ్మే మహిళగా కనిపించబోతుండగా..పలు సామాజిక సంఘాల నుండి నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మలయాళం సినిమాల్లో బీఫ్ నేపథ్యం కానీ, దానికి సంబంధించిన సన్నివేశాలు కానీ నేచురల్‌గానే చూపిస్తుంటారు.
ఈ పోస్టర్ లో కత్తి పట్టుకుని బీఫ్ మాంసం కొడుతుంది. ఆమె చుట్టూ దున్నపోతు తలకాయలు ఉన్నాయి. దీంతో రాహేలు మూవీని రిలీజ్ చేయకుండా ఆపేయాలంటూ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఆనంది బాల తెరకెక్కిస్తున్న ఈ మూవీ ముఖ్యంగా బీఫ్ రాజకీయాల నేపథ్యంలో..క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందనున్నట్లు తెలుస్తోంది.
ఇక హనీరోజ్కు ..సినిమాల్లో అవకాశాలు ఎక్కువ రాకపోయినప్పటికీ..తన హాట్ లుక్స్ తో..వీడియోస్ తో సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. తన సోషల్ మీడియా నుంచి ఒక్క ఫోటో పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. దీంతో పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో పాల్గొంటూ ..జస్ట్ చేత్తో రిబ్బన్ కట్ చేస్తే దాదాపు రూ.70 లక్షల దాకా చార్జ్ చేస్తోందని టాక్. ఎందుకంటే, ఆమెను చూసేందుకు జనం ఎగబడుతుండటంతో షాపు యాజమాన్యం కోరుకున్న పబ్లిసిటీ వచ్చేస్తోంది. కానీ, ఇదే హవా సినిమాల్లో కూడా చూపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.