హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ జూన్ 21న విడుదల

హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ జూన్ 21న విడుదల

చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాలరాజ్ నిర్మించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. ఈనెల 21న  సినిమా విడుదల.  గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య​ అతిథిగా హాజరైన రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్, నటుడు అవసరాల శ్రీనివాస్, దర్శకుడు దశరథ్​ బెస్ట్ విషెస్ చెప్పారు. 

అన్ని రకాల ఎమోషన్స్‌‌ ఉన్న పాత్రను ఇందులో పోషించినట్టు హీరో చైతన్య రావ్ చెప్పాడు.  ఈ సినిమాతో ఎక్సయిటింగ్, ఇంట్రెస్టింగ్‌‌ జర్నీ చేశామని హీరోయిన్ హెబ్బా పటేల్ చెప్పింది.  దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ ‘యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చే రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందించాం. చైతన్య  రావ్, హెబ్బా జంట ప్రేక్షకులకు కొత్త ఫీల్‌‌ను కలిగిస్తుంది’ అని తెలిపాడు.  టీమ్ అంతా పాల్గొన్నారు.