V6 News

మెస్సీ కోసం హనీమూన్ వాయిదా!..క్రేజీ ప్లకార్టుతో ఆశ్చర్యపర్చిన నవవధువు

మెస్సీ కోసం హనీమూన్ వాయిదా!..క్రేజీ ప్లకార్టుతో ఆశ్చర్యపర్చిన నవవధువు

కోల్ కతా:అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ శనివారం (డిసెంబర్ 13) భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. మెస్సీని చూసేందుకు వేలాది మంది అభిమానులు ఎయిర్ పోర్టు కు వచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఫుట్ బాల్  స్టార్ కి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఓ కొత్త పెళ్లి కూతురు ప్రదర్శించిన ప్లకార్డు అందరి దృష్టిని ఆకర్షించింది. మెస్సీ కోసం తన హనీమూన్ ను వాయిదా వేసుకున్నామంటూ సదరు నూతన వధువు క్రేజీ ప్లకార్డును ప్రదర్శించింది. 

ఈనెల 5న వివాహం జరగ్గా హనీమూన్ వెళ్లాల్సి ఉంది. అయితే, మెస్సీ వస్తున్నాడన్న విషయం తెలిసి ఈ కొత్త జంట తమ హనీమూన్ ను  క్యాన్సెల్ చేసుకుంది. ఈ విషయాన్ని ప్లకార్డు ద్వారా నూతన వధువు ప్రదర్శించింది. 'జస్ట్ మారీడ్.. మెస్సీని చూసేందుకు హనీమూన్ ను క్యాన్సెల్ చేసుకున్నాం  అని రాసిఉన్న ప్లకార్డును సదరు మహిళ ప్రదర్శించింది. ఈ ప్లకార్డు అక్కడికి వచ్చినవారి దృష్టిని ఆకర్షించింది.