Chandra Bose: గేయరచయిత చంద్రబోస్కు గౌరవ డాక్టరేట్

Chandra Bose: గేయరచయిత చంద్రబోస్కు గౌరవ డాక్టరేట్

ప్రముఖ గేయరచయిత చంద్రబోస్(Chandrabose) ను డాక్టరేట్ వరించింది. సినీ సాహిత్యంలో చంద్రబోస్‌ అందించిన సేవలకు గాను హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంత సాగర్‌లోని ఎస్‌.ఆర్‌. విశ్వవిద్యాలయం(S.R.University) ఆయనను గౌరవ డాక్టరేట్‌ తో సత్కరించింది. మార్చ్ 22 శుక్రవారం రోజున జరగబోయే ఎస్‌.ఆర్‌.విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకల్లో చంద్రబోస్‌కు డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయనున్నట్టు కాన్వకేషన్‌ కమిటీ చైర్మన్‌ సి.వి.గురురావు ప్రకటించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబోస్‌ తన సినీ ప్రయాణంలో 3600 పైగా పాటలు రాశారు. అందులో ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. అలా అయన సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసారు. మార్చ్ 22న జరగబోయే స్నాతకోత్సవంలో డిగ్రీ, డాక్టరేట్‌ ప్రదానంతో పాటు పూర్వ విద్యార్థులకు కూడా పెద్ద ఎత్తున సత్కార కార్యక్రమం జరపబోతున్నాం.. అంటూ చెప్పుకొచ్చారు.