అమ్మాయిని వేధించిన పోకిరీలు.. తల్లిదండ్రులపై తల్వార్లతో దాడి

అమ్మాయిని వేధించిన  పోకిరీలు.. తల్లిదండ్రులపై తల్వార్లతో దాడి

రంగారెడ్డి: నార్సింగిలో ఓ పోకిరి ముఠా రెచ్చిపోయింది. కిరాణా కొట్టుకు వెళ్లిన ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. సురేష్ అనే యువకుడు అమ్మాయి చేయి పట్టుకొని లాగి ఒంటిపై నీళ్లు పోశాడు. హోలీ పండుగ రోజు దొరకలేదంటూ వేధించి.. అమ్మాయిపై చేయి వేశాడు. దీంతో సురేష్ నుంచి తప్పించుకొని అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తన కూతురికి  జరిగిన అన్యాయాన్ని నిలదీయడానికి వెళ్లిన తల్లిదండ్రుల పైన సైతం పోకిరీలు తల్వార్ తో దాడి చేశారు. 

ప్రవీణ్ అనే యువకుడు యువతి తండ్రి గొంతు కోశాడు. అడ్డువచ్చిన యువతి తల్లిపై తల్వార్ తో దాడి చేసి గాయపరిచాడు. అంతటితో ఆగని పోకిరి గ్యాంగ్ బాధితురాలి కుటుంబ సభ్యులను చితకబాదారు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నార్సింగ్ పోలీసులు ప్రవీణ్, సురేష్ లతోపాటు ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. పోలీసులు నిందితుల నుంచి నాలుగు తర్వార్లు స్వాధీనం చేసుకున్నారు. 307 సెక్షన్ తోపాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ALSO READ :- వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య