
హైదరాబాద్, వెలుగు: కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ వర్సిటీకి చెందిన ప్యాక్‌హౌస్‌ను 11 నెలల కాలానికి ఆల్ నాచురల్ రూట్స్ ఇంపెక్స్ కంపెనీకి లెట్ అవుట్ (రెంట్) కు ఇచ్చామని రిజిస్ట్రార్ఎ.భగవాన్ తెలిపారు. ఆ కంపెనీ రెంట్ఇవ్వకపోవడంతో నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఈ నెల 19న ‘వెలుగు’ పత్రికలో ‘‘హార్టికల్చర్వర్సిటీలో రెంటల్గోల్ మాల్” కథనానికి శనివారం ఆయన వివరణ ఇచ్చారు.
వర్సిటీలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్స్టేషన్కు సంబంధించిన ప్యాక్‌హౌస్‌లో బీఎస్సీ హార్టికల్చర్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వ్యాల్యూ యాడెడ్ప్రొడక్ట్స్పై ప్రయోగాలు చేయడానికి, హ్యాండ్స్ఆన్ఎక్స్పీరియన్స్లో భాగంగా విద్యార్థులకు సహాయ పడేందుకు ఆల్ నాచురల్ కంపెనీకి రెంట్ కు ఇచ్చినట్టు తెలిపారు. 2022 డిసెంబర్17న నిర్వహించిన వర్సిటీ బోర్డు మీటింగ్‌లో 11 నెలల పాటు రెంట్ కు ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు.
మొదట 11 నెలలకు ఓకే చెప్పిన తర్వాత 33 నెలలకు అగ్రిమెంట్పొడిగించాలని సదరు సంస్థ తమను అభ్యర్థించిందని పేర్కొన్నారు. నెలకు రూ.58,734 రెంట్ తో పాటు కరెంట్, వాటర్బిల్లులు చెల్లించేలా 2023 జూన్ ఒకటో తేదీన అగ్రిమెంట్చేసుకున్నామని వెల్లడించారు. ఈ అగ్రిమెంట్2024 మే 31వ తేదీ వరకు ఉంటుందని వివరించారు. ‘‘అగ్రిమెంట్చేసుకున్న నాటి నుంచి ఆల్ నాచురల్ సంస్థ వర్సిటీకి రెంట్ తో పాటు కరెంట్, వాటర్బిల్లులు చెల్లించలేదు. అవి చెల్లించాలని ఈ నెల 15న సదరు సంస్థకు నోటీసులు ఇచ్చాం.
ఆయా బిల్లుల రసీదులను ఈ నెల 21లోగా సమర్పించకుంటే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించాం” అని పేర్కొన్నారు. రెంట్బేసిస్లో 33 నెలలకు అగ్రిమెంట్చేసుకుని, భూమిని అప్పగించారనేది అవాస్తవమని తెలిపారు. 11 నెలల కాలానికే లెట్అవుట్అగ్రిమెంట్చేసుకున్నామని, ఈ ఒప్పంద కాలాన్ని 33 నెలలకు మించి పొడిగించే అధికారం వర్సిటీకి, వైస్‌చాన్స్‌లర్‌కు, బోర్డ్ఆఫ్ మేనేజ్మెంట్కు లేదన్నారు.
ఆ ఒప్పందంతో సంబంధం లేదు : మాజీ మంత్రి
హార్టికల్చర్వర్సిటీకి సంబంధించిన ఐదెకరాల భూమిని ఒక సంస్థకు అప్పగిస్తూ వర్సిటీ స్థాయిలో చేసుకున్న ఒప్పందానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.