రాష్ట్రపతి భవన్లో కనిపించింది పులి కాదు పిల్లి : ఢిల్లీ పోలీసులు

  రాష్ట్రపతి భవన్లో కనిపించింది పులి కాదు పిల్లి :  ఢిల్లీ పోలీసులు

రాష్ట్రపతి భవన్ లో జూన్ 09వ తేదీ సాయంత్రం 7 గంటలకు  అతిరధ మహారధుల మధ్య మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేశారు.  ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ నాయకులు, ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలతో సహా దాదాపు 8,000 మంది అతిథులు హాజరయ్యారు.ఈ వేడుకకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. 

అదేంటంటే వీవీఐపీ రూమ్ లో ఓ జంతువు స్వేచ్ఛగా తిరుగుతుండటం వీడియోలో రికార్డు అయింది.  అయితే ఇది చిరుతపులినే అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.  ఇంటి పిల్లి అని, అది అడవి జంతువు కాదని  స్పష్టం చేశారు.  దయచేసి ఇలాంటి పనికిమాలిన పుకార్లను సృష్టించకండని పోలీసులు తెలిపారు.  జాతీయ మీడియాలో,సోషల్ మీడియాలో ఇది క్రూర జంతువుగా ప్రచారం చేశారని, ఇందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు.  రాష్ట్రపతి భవన్‌లో కుక్కలు, పిల్లులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. 

అటు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. తొలి సంతకం చేశారు. దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 20 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పీఎం కిసాన్ యోజన కింద 17వ విడత నిధులను విడుదల చేస్తూ సంతకం చేశారు మోదీ. దేశవ్యాప్తంగా 9 కోట్ల 30 వేల మంది రైతుల ఖాతాల్లో.. ఒక్కక్కొరికి 2 వేల రూపాయల చొప్పున వారి వారి బ్యాంకుల్లో పడనున్నాయి డబ్బులు.  ఈ సందర్బంగా మాట్లాడిన మోదీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రైతుల కోసం, వ్యవసాయ రంగం కృషి కోసం మరింత కృషి చేస్తామని చెప్పారు మోదీ.