డొమెస్టిక్ వర్కర్లకు కార్మిక చట్టాలు వర్తింపజేయాలి..ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి

డొమెస్టిక్ వర్కర్లకు కార్మిక చట్టాలు వర్తింపజేయాలి..ఇళ్లు లేని వారికి  డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి
  •     ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: ఇండ్లలో పని చేస్తున్న డొమెస్టిక్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌‌లో తెలంగాణ డొమెస్టిక్ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో జోసెఫ్ లిస్సి అధ్యక్షతన మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కృష్ణయ్య హాజరై మాట్లాడారు. 

డొమెస్టిక్ వర్కర్లను అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలను వర్తింపజేయాలని కోరారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన వేలాది మంది ఇండ్లలో పని చేస్తూ, వాచ్‌‌మెన్‌‌లుగా జీవనం సాగిస్తున్నారని చెప్పారు. 

ఇళ్లు లేని వారికి  డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్లు మంజూరు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ  జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, నవనీత, అల్లోసప్, నిర్మల, పాలియా తదితరులు పాల్గొన్నారు