ఇంట్లో క్రిమి కీటకాలు వేధిస్తున్నాయా.. కొబ్బరినూనెతో చెక్ పెట్టండి ఇలా..!

ఇంట్లో క్రిమి కీటకాలు వేధిస్తున్నాయా.. కొబ్బరినూనెతో చెక్ పెట్టండి ఇలా..!

 నిత్యం ఇంట్లో క్రిమి కీటకాలు ఉంటాయి.  ఇక ఈగలు.. దోమలు అయితే చెప్పే పనే లేదు. ఇవి మనుషులపై చేసే దాడి అంతా ఇంతా కాదు.. వీటినుంచి కాపాడుకొనేందుకు  పలు రకాల రెపెల్లెంట్స్ ను వాడతారు.. ఒక్కోసారి ఇవి హాని చేస్తాయి.  అలా కాకుండా.. తలకు రాసుకొనే కొబ్బరినూనెతో క్రిమి కీటకాల నుంచి రక్షణ పొందొచ్చని ఓ అధ్యయనం ద్వారా తెలుస్తుంది. . . 

ఏ కాలంలోనైనా చాలా ప్రాంతాల్లో దోమల్లాంటి క్రిమికీటకాలు ఎక్కువగానే ఉంటాయి. దాంతో ఇంట్లో రోజూ దోమల బత్తులు వాడుతారు. అయినా చాలావరకు అవి తిరుగతూ, కరుస్తూనే ఉంటాయి. అందుకే క్రిమికీటకాల నుంచి రక్షించే రెపెల్లెంట్స్​ ను  వాడుతుంటారు. రోజూ దాన్ని బట్టలకు, ఒంటికి రాసుకుంటా రు. అయితే ఈ రెపెల్లెంట్స్​లో  ఉపయోగించే  డై  ఇథైల్​ టోలమై డ్ (డీఈఈటీ) అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో దీనికి సంబంధించిన ఒక అధ్యయనం పబ్లిష్ అయింది. ఈ డీఈఈటీ కంటే మన ఇంట్లో వాడే కొబ్బరి నూనెమంచి రెపెల్లెంట్ గా పనిచేస్తుం దని ఆ అధ్యయనం తెలిపింది.

►ALSO READ | Telangana Kitchen: సూపర్ స్నాక్స్ ... వెరైటీ బ్రేక్ ఫాస్ట్.. ఇలా తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే.. పిల్లలు లొట్టలేస్తారు.. !

కొంతమంది శాస్త్రవేత్తలు ఈ విషయంపై పరిశోధన చేశారు. ఆ పరిశోధనల్లో డీఈఈటీ 50 శాతం పని చేస్తే... కొబ్బరి నూనె 95 శాతం ప్రభావం చూపిందట. అంతేకాదు, కొబ్బరినూనె ఎక్కువ సమయం పని చేసిందట. అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ క్రిమికీటకాలపై అద్భుతంగా పని చేస్తాయని రుజువైంది. జికా వైరస్ ను వ్యాపింపజేసే దోమల నుంచి కూడా ఈ కొబ్బరినూనె సంరక్షించిందని జా అనే శాస్త్రవేత్త తెలిపారు. మరింకేంటి, హాయిగా ఇక నుంచి భారీగా ఖర్చు చేసి రెపెల్లెంట్స్ కొనే బదులు కొబ్బరి నూనె వాడితే సరి పోతుంది కదా మరి..!